బెర్లిన్: ప్రేమికుల వారోత్సవం ముగింపు ఘట్టానికి చేరుకుంటోంది. ఇప్పటిదాకా ఒకెత్తు, రేపటి దినం మరో ఎత్తు. ఎన్ని ఇచ్చి పుచ్చుకున్నా, ఒకరి దగ్గర మరొకరు ఎంత గారాలు పోయినా రేపు అసలు పరీక్ష. ఎన్నో రోజుల ఎదురుచూపులకు తెర పడేది అప్పుడే. కాబట్టి ఆ ఒక్కరోజు ప్రేమించేవారి మనసు గెలిచామంటే చాలు.. జీవితాంతం వారితోనే బతికేస్తామంటూ ఊహల్లో బతికేస్తారు చాలామంది. కొందరు ఊహలు నిజమైతే మరికొందరివి మాత్రం పగటి కలల్లాగే మిగిలిపోతాయనుకోండి.. అది వేరే విషయం. అయితే ప్రేమను వ్యక్తపరిచే కళ అందరికీ ఉండదు. ఎన్నెన్నో అనుకున్నా ఎదురుగా ప్రేయసి/ ప్రేమికుడు తారసపడేసరికి మాత్రం నోరు మూగబోతుంది. అందుకే కొందరు నేరుగా కాకుండా మెసేజ్‌లోనో, కాల్ చేసో, ఉత్తరం రాసో, ఫ్రెండ్ ద్వారానో ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు తమ మనసులోని మాటను ఇష్టసఖికి చేరవేస్తారు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం తను ప్రేమించిన అమ్మాయికి కనీవినీ ఎరుగని రీతిలో ప్రపోజ్ చేసి వార్తల్లో నిలిచాడు.(ప్రేమకు అసలైన నిర్వచనం ప్రేమలేఖలే)
గూగుల్ మ్యాప్‌లో పెళ్లి ప్రపోజల్