శ్రీకాకుళం: జిల్లాలో ఇప్పటివరకు పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. అలాగని ప్రభుత్వం, అధికారులు తేలికగా తీసుకోవడం లేదు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా మరింత లోతుగా పరిశీలన చేస్తున్నారు. ప్రయాణాల చరిత్ర ఆ«ధారంగా ట్రాక్ చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. ప్రతి పది మందికీ ఒక కోవిడ్ ఆఫీసర్‌ను నియమించారు. వారిని పర్యవేక్షించేందుకు మండలానికో స్పెషల్ ఆఫీసర్‌ను ఏర్పా టు చేయగా, జిల్లా స్థాయిలో కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు.
కరోనా ప్రభావం పెరిగిన నేపథ్యంలో విదేశాల నుంచి జిల్లాకు 1445 మంది వచ్చారు. వారందర్నీ ప్రత్యే క క్వారంటైన్‌లోనూ, హోమ్ క్వారంటైన్‌లో పెట్టా రు. లక్షణాలు ఉన్న వారికి ఎప్పటికప్పుడు శాంపి ల్స్ తీసి పరీక్షలు చేశారు. ఇంతవరకైతే విదేశాల నుంచి వచ్చిన వారెవరికీ పాజిటివ్ రాలేదు. దా దాపు శాంపిల్స్ అన్నీ నెగిటివ్ ఫలితాలొచ్చా యి. విదేశాల నుంచి వచ్చిన వారిలో అంతా దాదాపు 14 రోజులకు పైగా క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు. దీంతో వారి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం కని్పంచడం లేదు.