నెల్లూరు, నాయుడుపేటటౌన్: పట్టణంలో కోవిడ్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏకంగా ఎనిమిది కేసులు నమోదు కావడంతో అధికారులు మంగళవారం హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీకి వెళ్లిన 21 మందిలో ఐదుగురికి, అందులో ఇద్దరి వ్యక్తుల కుటుంబ సభ్యులు, బంధువులు ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధికారులను అప్రమత్తం చేశారు. ఆర్డీఓ సరోజినీ, సీఐ జి.వేణుగోపాల్‌రెడ్డి, కమిషనర్ లింగారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సై డి.వెంకటేశ్వరరావులతో సమావేశమై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రమాదేవి, వైద్యాధికారిణి దేదీప్యారెడ్డి, వైద్య సిబ్బంది పూర్తి వివరాలను రాబడుతున్నారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో తరచూ బ్లీచింగ్ చల్లించడమే కాకుండా హైపో సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు.
పేటలో హై అలర్ట్